sri reddy: శ్రీరెడ్డి వివాదంపై హీరోయిన్ ఆండ్రియా స్పందన

  • శ్రీరెడ్డి వివాదం గురించి నన్ను కూడా ప్రశ్నిస్తుంటారు
  • అలాంటివి బయటపెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి
  • ఇంత వరకు నాకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు

వివాదాలు, విమర్శలను ఏమాత్రం పట్టించుకోని నటిగా ఆండ్రియాకు గుర్తింపు ఉంది. కమలహాసన్ సరసన ఆమె నటించిన 'విశ్వరూపం-2' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించిన తరువాత తనలో సామాజిక బాధ్యత ఎక్కువైందని తెలిపింది. ప్రస్తుతం తాను నటిగా, గాయనిగా కొనసాగుతున్నానని చెప్పింది.

ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఎంతో ధైర్యం అవసరమని ఆండ్రియా తెలిపింది. నటి శ్రీరెడ్డి వివాదాల గురించి తనను ప్రశ్నిస్తూ ఉంటారని... ఆమె చెబుతున్న వాటిలో నిజం ఉంటే, వాటిని బహిరంగపరచడానికి ఆమెకు ఎంతో ధైర్యం కావాలని చెప్పింది. ఎవరికైనా అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు, వాటిని కచ్చితంగా బయటపెట్టాలని సూచించింది. ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పింది. తనకైతే ఇంతవరకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని తెలిపింది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News