Sonia Gandhi: మీరు సూపర్.. బాగా చేస్తున్నారు.. క్యారీ ఆన్!: టీడీపీ ఎంపీ శివప్రసాద్‌కు సోనియా ప్రశంస

  • హిజ్రా వేషధారణలో పార్లమెంటుకు ఎంపీ శివప్రసాద్
  • మోదీని బాయ్యా అంటూ సంబోధన
  • ఎంపీని చూసి బిగ్గరగా నవ్వేసిన సోనియా గాంధీ

విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవాలంటూ రోజుకో వేషంతో పార్లమెంటు వద్ద ఆకట్టుకుంటున్న టీడీపీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ నుంచి ప్రశంసలు లభించాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశ చివరి రోజైన శుక్రవారం శివప్రసాద్ హిజ్రా వేషధారణతో పార్లమెంటుకు చేరుకుని ‘మోదీ బాయ్యా’ అంటూ నిరసన తెలిపారు.

కాగా, శుక్రవారం రాఫెల్ ఒప్పందంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. ఆందోళన అనంతరం సోనియా గాంధీ సభ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో గేటు నంబరు 1 వద్ద టీడీపీ ఎంపీలు నిరసన చేస్తుండడాన్ని సోనియా గమనించారు. శివప్రసాద్ హిజ్రా వేషధారణలో ఉండడాన్ని చూసి సోనియా నవ్వాపుకోలేకపోయారు. బిగ్గరగా నవ్వేశారు. దీంతో శివప్రసాద్ ఆమెకు నమస్కరించారు. ఆ వెంటనే ఆయన దగ్గరకు వచ్చిన సోనియా.. ‘‘గుడ్, బాగా చేస్తున్నారు. మీరు మంచి యాక్టర్’’ అని ప్రశంసించారు. డిమాండ్ల సాధనకు ఇలాగే నిరసన కొనసాగించాలని సూచించి వెళ్లిపోయారు.

అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఎన్ని వేషాలు వేస్తున్నా మోదీ మనసు మాత్రం కరగడం లేదన్నారు. అందుకే చివరికి ఈ వేషం వేయాల్సి వచ్చిందంటూ పాటందుకున్నారు.  

Sonia Gandhi
Congress
Telugudesam
Siva prasad
Andhra Pradesh
  • Loading...

More Telugu News