ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ ఫొటోలు మళ్లీ లీక్... తలలు పట్టుకుంటున్న యూనిట్!
- ఆగస్టు 15న సినిమా టీజర్
- ముందే లీకైన టీజర్ ఫొటోలు
- యూనిట్‌లోని వారి పనేనని అనుమానం
‘అరవింద సమేత’కు సంబంధించిన ఫొటో ఒకటి ఇటీవల కూడా లీకైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శకుడు త్రివిక్రమ్ ఇకపై షూటింగ్ స్పాట్‌లోకి ఎవరూ ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశాలు జారీ చేశాడట. అయినప్పటికీ తాజాగా ఫొటోలు లీకవడం యూనిట్‌ను కలవరపెడుతోంది. విడుదలైన ఫొటోలలో సీన్‌కు సంబంధించిన సమయం కూడా ఉండడంతో యూనిట్‌లోని వారే ఎవరో వీటిని నెట్‌లో పెట్టి ఉంటారని భావిస్తున్నారు.