JC Diwakar Reddy: మోదీ మూర్ఖుడు.. చెబితే అర్థం చేసుకునే రకం కాదు!: జేసీ సంచలన వ్యాఖ్యలు

  • మోదీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు
  • మంత్రులు కూడా అంతే.. వారూ మూర్ఖులే
  • ఎంపీగా నేను సంతృప్తిగా లేను

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీలో నిరంకుశత్వం పెరిగిపోయిందని, ఆయన మూర్ఖుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెబితే అర్థం చేసుకునే మనిషి అస్సలు కాడని పేర్కొన్నారు. ఆయన వద్ద ఉన్న మంత్రులు కూడా అటువంటి వారేనని అన్నారు. రైల్వే, ఆర్థిక మంత్రుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు. వారు కూడా మోదీలానే నిరంకుశుల్లా తయారయ్యారన్నారు.  మోదీ ప్రభుత్వం నుంచి ఏపీ ఏమీ సాధించలేదని తేల్చి చెప్పారు. సాధిస్తామన్న నమ్మకం కూడా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గుతుందేమో కానీ, అదే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో టీడీపీకి 25 లోక్‌సభ స్థానాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఎంపీగా తానైతే సంతృప్తిగా లేనని జేసీ పేర్కొన్నారు. ఓ ఎంపీగా తాను నిర్వర్తించాల్సిన విధుల పట్ల తనకు ఏమాత్రం సంతృప్తి లేదన్నారు. ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతసేపటికీ నిరసనలతో సరిపెడుతున్నామని, ప్రతి పార్టీ నిరసనలకే పరిమితమవుతోందని జేసీ పేర్కొన్నారు.   

JC Diwakar Reddy
Andhra Pradesh
Anantapur District
BJP
Telugudesam
  • Loading...

More Telugu News