gvl: అవును.. జీవీఎల్ కి వందల కోట్ల ఆస్తులున్నాయి!: మళ్లీ ఆరోపించిన బుద్ధా వెంకన్న

  • జీవీఎల్ పై వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా
  • ఆయనకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి
  • జీవీఎల్ అవినీతిని బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి ఆరోపణలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవీఎల్ పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. జీవీఎల్ కు వందల కోట్ల ఆస్తులున్నాయని, ఆయన అవినీతి బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. జీవీఎల్ ఆస్తులు ఏ రూపంలో ఉన్నాయో చెబుతామని, తాను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే ఏపీ వదిలి వెళ్లిపోతానని బుద్ధా వెంకన్న మరోసారి సవాల్ విసిరారు.

gvl
budha
  • Loading...

More Telugu News