GodavariUS: ప్రెస్ నోట్: లారెల్, మేరీల్యాండ్ లో `గోదావరి`ఘుమఘుమలు!
ప్రెస్ నోట్: తమ కలలను నెరవేర్చుకునేందుకు సప్త సముద్రాలు దాటి భారత్ నుంచి అమెరికా వచ్చిన తెలుగువారికి.....తెలుగింటి కమ్మటి భోజనం అందించాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం “గోదావరి” రెస్టారెంట్ ప్రారంభించారు.
ఒక రెస్టారెంట్ తో మొదలైన “గోదావరి” ప్రస్థానం....అనతి కాలంలోనే అంచెలంచెలుగా 26 రెస్టారెంట్లు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. యూఎస్ ఏలో “గోదావరి” ఈజ్ నాట్ ఎ రెస్టారెంట్....ఇట్స్ ఎ బ్రాండ్....అన్న తరహాలో తెలుగు ప్రజలతో పాటు అమెరికన్లకు నాణ్యమైన, రుచికరమైన భారతీయ వంటకాలను అందిస్తూ అందరి మన్ననలు చూరగొంది.
ఇంతితై...వటుడింతై అన్న చందంగా ఎదిగిన ”గోదావరి” తాజాగా అమెరికాలోని మేరీల్యాండ్ లో రెండో బ్రాంచ్ ను ప్రారంభించనుంది. ఆగస్టు 11న మేరీల్యాండ్ లోని లారెల్ లో మరో రెస్టారెంట్ ను ‘గోదావరి” సగర్వంగా ప్రారంభించనుంది.
కార్పొరేట్ తరహాలో విస్తరించాలని భావిస్తోన్న “గోదావరి”....లారెల్ లో ప్రముఖ బ్రాండ్ “కర్రీ లీఫ్” ను టేక్ ఓవర్ చేసింది. ఇప్పటికే మేరీల్యాండ్ లోని గెయిథర్స్ బర్గ్ లో ప్రారంభమైన “గోదావరి” రెస్టారెంట్ బాగా పాపులర్ అయింది. నయాగారా ఫాల్స్ దగ్గరున్న బ్రాంచ్ తో పాటు మొత్తం 26కు పైగా రెస్టారెంట్లకు “గోదావరి” విస్తరించింది.
ఐదేళ్లనుంచి “కర్రీ లీఫ్” రెస్టారెంట్.... లారెల్ లో భారతీయ వంటకాలను అందిస్తోంది. భారతీయులు అధికంగా నివసించే లారెల్ ప్రాంతంలో తమ బ్రాండ్ ను విస్తరించే క్రమంలో “కర్రీ లీఫ్” ను “గోదావరి’ టేక్ ఓవర్ చేసింది (Indian restaurant in Laurel, Maryland). రెండున్నరేళ్లుగా గెయిథర్స్ బర్గ్ లోని `గోదావరి`రెస్టారెంట్ ను నిర్వహిస్తోన్న కామాక్షి.....లారెల్ ఫ్రాంచైజ్ ను కూడా దక్కించుకోవడం విశేషం.
లారెల్ లో “గోదావరి”ని ఆగస్టు 11న లాంచ్ చేయబోతున్నామని కామాక్షి తెలిపారు. ఆ రోజున గ్రాండ్ ఓపెనింగ్ బఫెట్ లో రుచికరమైన భారతీయ వంటకాలను వడ్డించనున్నామని తెలిపారు.
“చిల్లీ ఇడ్లీ”, “కొత్తిమీర మాంసం”, “పిఠాపురం పీతల వేపుడు”, “కోడి చిప్స్”, “పైనాపిల్ రసం” వంటి ప్రత్యేక వంటకాలతోపాటు....మరెన్నో “గోదావరి” వంటింటి నుంచి మరెన్నో వంటకాలను అందించనున్నామని చెప్పారు. ఈ వీకెండ్ ను “గోదావరి లారెల్” లో ఎంజాయ్ చేయాలని కామాక్షి కోరారు.
లారెల్ లో తాను 12 ఏళ్లుగా నివసిస్తున్నానని, 30 నిమిషాల్లో చేరుకునేలా సమీపంలో మరే ఇండియన్ రెస్టారెంట్ లేదని అరవింద్ తెలిపారు(Best South Indian restaurant in Laurel, Maryland). తాను ఇప్పటివరకు “కర్రీ లీఫ్”కు వెళ్లేవాడినని, తమ ప్రాంతంలో “గోదావరి” ఘుమఘుమలు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.
కార్పొరేట్ తరహాలో విస్తరించాలని భావిస్తోన్న “గోదావరి” భవిష్యత్తులో “కర్రీ లీఫ్” తరహాలో మరిన్ని ప్రముఖ రెస్టారెంట్లను టేకోవర్ చేయాలని, టై అప్ కావాలని భావిస్తోంది.
మరోవైపు, తమ “గోదావరి” బ్రాండ్ ను యూఎస్ ఏతో పాటు ఆస్ట్రేలియా, కెనడాలకూ విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. త్వరలోనే తమ తొలి అంతర్జాతీయ బ్రాంచ్ ను ఒమన్ రాజధాని మస్కట్ లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని “టీమ్ గోదావరి” తెలిపింది.
దేశవ్యాప్తంగా 26కు పైగా లొకేషన్లలో ప్రతి రోజు వేలాదిమందికి రుచికరమైన, నాణ్యమైన భారతీయ వంటకాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. త్వరలోనే “గోదావరి’ బ్రాండ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపింది.
అమెరికాతో పాటు విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారందరికీ తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అచ్చ “తెలుగు” భోజనాన్ని, ఆతిథ్యాన్ని అందించడమే తమ లక్ష్యమని తెలిపింది.
అంచెలంచెలుగా ఎదిగిన తమ “గోదావరి” టీంకు గుర్తింపుగా .... “టీవీ9” చానెల్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేశారని తెలిపింది. ఆ కార్యక్రమాన్ని ఈ లింక్ ద్వారావీక్షించవచ్చు: https://www.youtube.com/watch?v=pAnnDNt2X6A
ఆగస్టు 11న లారెన్ లో “గోదావరి” రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ బఫెట్ కు వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని “గోదావరి టీం” ఆహ్వానం పలికింది.
అతిథులు రావాల్సిన చిరునామా:
“గోదావరి లారెల్”
13919 బాల్టిమోర్ అవెన్యూ#4
లారెల్, మేరీల్యాండ్ 20707
సంప్రదించండిః
మూర్తి
ఫోన్ః 781-869-0274
ఈమెయిల్: Laurel@GodavariUS.com
మరోమారు మీకు ధన్యవాదాలు. మాఆత్మీయ రుచిని మీరు ఆస్వాదిస్తారని భావిస్తున్నాం.
Press release by: Indian Clicks, LLC