mla roja: డాక్టర్ శిల్ప మ‌ృతి వెనుక టీడీపీ ఎమ్మెల్యే బంధువులు ఉన్నారు: ఎమ్మెల్యే రోజా ఆరోపణ

  • శిల్ప మృతి కేసును నీరుగార్చాలని ప్రభుత్వం చూస్తోంది
  • ఆత్మహత్య దర్యాప్తు నివేదికను బయటపెట్టాలి
  • శిల్ప కుటుంబ సభ్యులతో గవర్నర్ ను కలుస్తాం

డాక్టర్ శిల్ప మృతి వెనుక టీడీపీ ఎమ్మెల్యే బంధువులు ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, శిల్ప మృతి కేసును నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శిల్ప ఆత్మహత్య దర్యాప్తు నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. సీనియర్ డాక్టర్లను రెచ్చగొట్టి జూనియర్ డాక్టర్ల పోరాటాన్ని అడ్డుకుంటున్నారని, శిల్ప కుటుంబ సభ్యులతో కలసి గవర్నర్ ను కలుస్తామని రోజా చెప్పారు.
 
కాగా, డాక్టర్ శిల్ప మృతి ఘటనలో ప్రిన్సిపల్ రమణయ్యను సస్పెండ్ చేయడాన్ని సీనియర్ డాక్టర్లు తప్పుపడుతున్నారు. రమణయ్యను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, రమణయ్యపై సస్పెన్షన్ ఎత్తివేస్తే ఉద్యమం తప్పదని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. 

mla roja
Telugudesam
Doctor shilpa
  • Loading...

More Telugu News