renu desai: రేణు దేశాయ్ డైరెక్షన్.. రైతు సమస్యలే ప్రధానంగా సినిమా!

  • రైతుల జీవితాలే ప్రధాన కథాంశం 
  • వాళ్ల సమస్యలకి పరిష్కారాలు 
  • వచ్చే ఏడాది సెట్స్ పైకి

ఈ మధ్య .. నటిగా రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలను రేణు దేశాయ్ ఖండిస్తూ .. దర్శకత్వంపై తప్ప తనకి నటనపై దృష్టి లేదని చెప్పారు. త్వరలోనే ఒక తెలుగు సినిమాకి దర్శకత్వం వహించనున్నానని అన్నారు. స్క్రీన్ ప్లే పూర్తయిందనీ .. డైలాగ్స్ రాస్తున్నానని చెప్పారు.

రేణు దేశాయ్ రూపొందిస్తోన్న సినిమా రైతు సమస్యల నేపథ్యంలో కొనసాగుతుందట .. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. "రైతుల జీవితాలు .. సమస్యలు .. వాళ్ల ఆత్మహత్యలపై ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాలో రైతుల సమస్యలను చూపించడమే కాదు, వాటికి పరిష్కారాలు చూపడం కూడా జరుగుతుంది. ముందుగా రైతుల జీవితాలను చాలా దగ్గరగా పరిశీలించాలని అనుకుంటున్నాను. ఈ విషయంపై బాగా అధ్యయనం చేసి .. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగును మొదలుపెడతామని చెప్పుకొచ్చారు.  

renu desai
  • Loading...

More Telugu News