priyadarshi: మహేశ్ బాబు నన్ను అలా ఆటపట్టించేవారు: కమెడియన్ ప్రియదర్శి

  • మహేశ్ బాబు నన్ను గుర్తుపట్టారు 
  • ఆయనకి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ
  • సేవా గుణమూ ఎక్కువే  

ఈ మధ్య కాలంలో కమెడియన్ గా ప్రియదర్శి మంచిపేరు తెచ్చుకున్నాడు. తనదైన శైలిలో హాస్యాన్ని పంచుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. దాంతో వరుస అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మహేశ్ బాబుతో 'స్పైడర్' చేసినప్పటి సంగతులను గుర్తుచేసుకున్నాడు.

 "స్పైడర్ ' సినిమా సమయంలోనే మహేశ్ బాబును చూశాను. ఆయన నన్ను గుర్తుపట్టేసి ఆనందాశ్చర్యాలతో ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు .. అది చాలు ఈ జీవితానికి అనిపించింది. 'స్పైడర్' సినిమా కోసం నేను తమిళంలో ఒక డైలాగ్ సరిగ్గా పలకలేదు .. దాంతో సెట్లో అందరూ నవ్వేశారు. అప్పటి నుంచి నేను కనిపించినప్పుడల్లా మహేశ్ బాబు ఆ డైలాగ్ చెబుతూ నన్ను ఆటపట్టించేవారు. అలాగే 'పెళ్లి చూపులు'లో నా మాడ్యులేషన్ గురించిన ప్రస్తావన తెస్తూ నవ్వించేవారు. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ను తట్టుకోవడం చాలా కష్టం .. ఆయన వేసే కౌంటర్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయనలో సేవా గుణం చాలా ఎక్కువ .. అయితే ఆ విషయాలను బయటికి చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడరు" అని చెప్పుకొచ్చాడు.    

priyadarshi
Mahesh Babu
  • Loading...

More Telugu News