Talasani srinivas yadav: ఎన్టీఆర్, ప్రభాస్ లకు తలసాని గ్రీన్ ఛాలెంజ్!

  • ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి
  • దర్శకుడు త్రివిక్రమ్, టీటీడీ చైర్మన్ సుధాకర్ కూ ఛాలెంజ్
  • మానవాళి కోసం మొక్కలు నాటాలని పిలుపు

తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్ లకు ఈ రోజు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను తలసాని స్వీకరించారు. అనంతరం తన ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలు నాటిన ఆయన.. హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్, దర్శకుడు త్రివిక్రమ్, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటామని తెలిపారు. మానవాళి మనుగడ కోసం ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని తలసాని వ్యాఖ్యానించారు.

Talasani srinivas yadav
Telangana
green challenge
TTD
  • Error fetching data: Network response was not ok

More Telugu News