sudheer babu: 'నన్ను దోచుకుందువటే' నుంచి ఆకట్టుకునే ఫస్టు సాంగ్

  • దర్శకుడిగా ఆర్.ఎస్.నాయుడు 
  • అలరిస్తోన్న సంగీతం 
  • ఆకట్టుకునే సాహిత్యం      

సుధీర్ బాబు .. నాభా నటేశ్ జంటగా 'నన్ను దోచుకుందువటే' సినిమా రూపొందింది. సరికొత్త ప్రేమకథా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమాకి ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. "మౌనం మాట తోటి ఊసులు ఏవో చెబుతోందా .. ముల్లే పూవు చెప్పే ఊహలన్నీ వింటుందా .. తెల్లని కాగితం .. రంగుల సంతకం .. కలిపిన కొత్త జాతకం .. రంగవల్లిలా మెరుపులద్దుకుందా" అంటూ ఈ సాంగ్ అందంగా సాగింది.

అజనీశ్ లోకనాథ్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. సుధీర్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'భలే మంచి రోజు' .. 'సమ్మోహనం' సినిమాల సక్సెస్ తో, సుధీర్ బాబు సినిమాలు కొత్తగా వుంటాయనే నమ్మకం అందరిలోను ఏర్పడింది. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి. 

sudheer babu
nabha natesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News