Lover: ప్రియురాలితో పరారైన స్నేహితుడు... వాళ్ల ఆచూకీ చెప్పమంటూ యువకుడికి పోలీసుల వేధింపులు.. ఆత్మహత్య!

  • మహబూబ్ నగర్ లో ఘోరం
  • ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న శ్రీకాంత్
  • తనకే పాపమూ తెలియదని వెల్లడి

తన స్నేహితుడు అతని ప్రియురాలితో పారిపోగా, పదేపదే ఆ యువతి తల్లిదండ్రులు వచ్చి తనను ప్రశ్నిస్తూ, పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పుతుంటే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. మహబూబ్ నగర్ లో ఈ ఘోరం జరిగింది. ఆత్మహత్యకు ముందు ఆ యువకుడు సెల్ఫీ వీడియోలో తన బాధను వెలిబుచ్చాడు. మాచన్ పల్లికి చెందిన శ్రీకాంత్, అంజి మంచి మిత్రులు. ఓ యువతిని ప్రేమించిన అంజి, ఆమెను తీసుకుని పారిపోగా, అతను ఎక్కడున్నాడన్న విషయం శ్రీకాంత్ కు తెలుసునని పోలీసులకు యువతి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు శ్రీకాంత్ ను విచారిస్తూ, పారిపోయిన ఇద్దరి ఆచూకీ చెప్పాలంటూ అతనిపై ఒత్తిడి పెంచారు. తనకు తెలియని విషయాన్ని ఎలా చెప్పాలని మధనపడిన శ్రీకాంత్, వారు పారిపోవడం వెనుక తన ప్రమేయం లేదని, తనకు ఏ పాపం తెలియదని చెబుతూ ఆర్టీయే ఆఫీస్ ఎదురుగా ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

Lover
Friedn
Srikant
Anji
Mahaboobnagar
Train
Sucide
  • Loading...

More Telugu News