USA: అత్తమామలకు అమెరికా పౌరసత్వాన్ని ప్రసాదించిన డొనాల్డ్ ట్రంప్!

  • గురువారం నాడు అమెరికా పౌరులుగా ప్రమాణం
  • విక్టర్, అమాలిజాలతో ప్రమాణం చేయించిన అధికారులు
  • తాను స్పందించాల్సిన అవసరం లేదన్న మెలానియా ట్రంప్

అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్ తల్లిదండ్రులకు ఎట్టకేలకు అమెరికా పౌరసత్వం లభించింది. గురువారం నాడు న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ అత్తమామలు విక్టర్, అమాలిజా క్నావ్స్ అమెరికా పౌరులుగా ప్రమాణం చేశారని, 'చైన్ మైగ్రేషన్' విధానంలో వీరికి పౌరసత్వం లభించిందని అధికారులు వెల్లడించారు. కాగా, స్లావేనియా నుంచి అమెరికాకు వలస వచ్చిన వీరిద్దరికీ, ప్రస్తుతం చట్టబద్ధమైన శాశ్వత నివాసదారుల హోదా ఉంది.

ట్రంప్ అధ్యక్షుడైన తరువాత వీరిద్దరికీ పౌరసత్వం లభిస్తుందని అందరూ భావించారు. తాజాగా, అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. మన్ హటన్ ఫెడరల్ బిల్డింగ్ లో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారుల సమక్షంలో వీరు ప్రమాణం చేశారని విక్టర్ తరఫు న్యాయవాది మైఖేల్ వీల్డ్స్ వెల్లడించారు. అయితే, తన తల్లిదండ్రులకు పౌరసత్వంపై వ్యాఖ్యానించేందుకు మెలానియా నిరాకరించడం గమనార్హం. వారు ఇరువురూ పాలనలో భాగస్వాములు కాదు కాబట్టి, మెలానియా స్పందించాల్సిన అవసరం లేదని ఆమె తరఫు ప్రతినిధి స్టెఫానీ గ్రిషామ్ వెల్లడించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News