Tirumala: తిరుమలకు రావద్దన్నా వినని భక్తులు... కొండపై రద్దీ!
- మహా సంప్రోక్షణను తిలకించేందుకు ఇప్పటి నుంచే పోటీ
- నేడు వెళితే, రెండో రోజైనా దర్శనం కలుగుతుందన్న ఉద్దేశం
- రేపటి నుంచి 16 వరకూ మహా సంప్రోక్షణ
రేపటి నుంచి తిరుమలలో అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరగనున్న నేపథ్యంలో భక్తులు రావద్దని, కేవలం పరిమిత సంఖ్యలో దర్శనాలు ఉంటాయని టీటీడీ అధికారులు ఎంతగా ప్రచారం చేసినా భక్తులు లక్ష్యపెట్టడం లేదు. నడకదారి భక్తులకు దివ్యదర్శనం, టైమ్ స్లాట్ దర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన అధికారులు, కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసినా, మహా సంప్రోక్షణను తిలకించాలన్న ఉద్దేశంతో వేలాది మంది భక్తులు కొండకు చేరుకుంటున్నారు.
ఒకరోజు ముందుగానే వెళితే, కనీసం రెండు, లేదా మూడో రోజు దర్శన భాగ్యం కలుగుతుందన్న ఉద్దేశంలో భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం దర్శనం కోసం వచ్చే భక్తులకు 8 గంటల సమయం తరువాత దర్శనం చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, రేపటి నుంచి 16వ తేదీ వరకూ మహా సంప్రోక్షణ జరగనున్న సంగతి తెలిసిందే.