APSRTC: ఆర్టీసీ ఎన్నికల్లో పులివెందులలో ఓటమి పాలైన వైఎస్సార్ మజ్దూర్ యూనియన్

  • ఆర్టీసీ ఎన్నికల్లో పులివెందులలో వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ ఓటమి
  • 47 ఓట్లతో గెలిచిన ఎన్ఎంయూ
  • రాష్ట్రస్థాయిలో ఎన్ఎంయూకు ఎదురుదెబ్బ

ఈయూతో కూటమి కట్టి ఆర్టీసీ ఎన్నికల్లో బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల డిపోలో పరాభవం ఎదురైంది. ఎన్‌ఎంయూపై పోటీకి దిగిన వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ 47 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. రాష్ట్రస్థాయి గుర్తింపు ఎన్నికల్లో ఎన్ఎంయూకు 237 ఓట్లు రాగా, ఈయూ-వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ కూటమికి 183 ఓట్లు వచ్చాయి. రీజియన్ స్థాయిలో ఎన్ఎంయూకు 234 ఓట్లు, ఈయూ-వైఎస్సార్ మజ్దూర్ యూనియన్‌కు 187 ఓట్లు వచ్చాయి.  

గురువారం జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో టీడీపీ మద్దతిచ్చిన ఎన్ఎంయూ (నేషనల్ మజ్దూర్ యూనియన్) ఓడిపోయింది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ వైఎస్ఆర్ సీపీ మజ్దూర్ యూనియన్, కార్మిక పరిషత్, ఎస్ డబ్ల్యూఎఫ్ (స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్)ల మద్దతుతో ఈయూ (ఎంప్లాయిస్ యూనియన్) విజయం సాధించింది. 

APSRTC
Elections
Yanamala
Telugudesam
Pulivendula
  • Loading...

More Telugu News