poota rekulu: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆత్రేయపురం పూతరేకు!

  • ఏపీ టూరిజం ఆధ్వర్యంలో విజయవాడలో కార్యక్రమం
  • ఆత్రేయపురం నిపుణులతో అతిపెద్ద పూతరేకు తయారీ 
  • పది మీటర్ల పొడవుతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి

‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం పూతరేకుకు స్థానం లభించింది. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో గురువారం విజయవాడలోని బెరంపార్కులో ఆత్రేయపురం పూతరేకుల తయారీ నిపుణులు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించి 10 మీటర్ల పొడవైన పూతరేకును నోరూరేలా తయారుచేశారు. ఆత్రేయపురం పూతరేకుకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
దీంతో దేశంలోనే దీనిని అత్యంత పెద్ద పూతరేకుగా గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు నిర్వాహకులకు ధ్రువీకరణ పత్రం అందించారు. తమ పూతరేకుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడంతో ఆత్రేయపురం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

poota rekulu
Atreyapuram
Andhra Pradesh
India book of records
  • Loading...

More Telugu News