Tara choudary: రాజశేఖర్‌కు, నాకు మధ్య ఏ సంబంధం లేదు.. ఆ వార్తల్లో నిజం లేదు!: తారాచౌదరి

  • రాజశేఖర్‌తో నాది ముఖ పరిచయమే
  • ఓసారి మా పక్క ఫ్లాట్ ఖాళీగా ఉంటే చూడడానికి వచ్చారు
  • ఆయన చాలా మంచి వ్యక్తి

సినీ నటుడు రాజశేఖర్‌కు, తనకు మధ్య ఏదో ఉందన్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదని తారా చౌదరి స్పష్టం చేసింది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన తారా చౌదరి పేరు తాజాగా మరోమారు తెరపైకి వచ్చింది. రాజశేఖర్‌తోనూ ఆమెకు సంబంధాలున్నాయన్న విషయం ఒకప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనిపై అప్పట్లో రాజశేఖర్ వివరణ కూడా ఇచ్చారు. తాజాగా ఇప్పుడు తారా చౌదరి ఈ విషయంలో స్పష్టత నిచ్చింది.
 
 రాజశేఖర్ అంటే తనకు అభిమానమని పేర్కొన్న తార.. ఆయన నటించిన ‘మా అన్నయ్య’ సినిమా తనకు బాగా నచ్చిందని పేర్కొంది. హైదరాబాద్‌లో ఓసారి షూటింగ్ సమయంలో రాజశేఖర్‌ను కలిసి ఈ సినిమా గురించి చెప్పానని తెలిపింది. సినిమా చాలా బాగుందని చెప్పానని, దానికి ఆయన చాలా సంతోషించారని పేర్కొంది.

హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో తాను నివసించే ఫ్లాట్ పక్కనే మరోటి ఖాళీగా ఉంటే చూసేందుకు రాజశేఖర్, జీవిత వచ్చారని, అలా వారితో తనకు ముఖ పరిచయం ఏర్పడిందని స్పష్టం చేసింది. అంతే తప్ప తమపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపడేసింది. రాజశేఖర్ చాలా మంచి వ్యక్తని పేర్కొన్న తార బయట ఎవరెవరో ఏవేవో అనుకుంటారని, వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని పేర్కొంది.  

Tara choudary
Raja sekhar
Tollywood
Affair
  • Loading...

More Telugu News