Jagan: యూటర్న్ బోర్డులు ఉన్నచోట జగన్ ఫొటో పెట్టాలి: బుద్ధా వెంకన్న సెటైర్లు

  • యూటర్న్ తీసుకోవడంలో జగన్ సిద్ధహస్తుడు
  • డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ ఓటేయలేదు
  • బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాల్సి వస్తుందనేగా

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు విసిరారు. యూటర్న్ తీసుకోవడంలో జగన్ సిద్ధహస్తుడని, యూటర్న్ బోర్డులు ఉన్న చోట జగన్ ఫొటో పెట్టాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాల్సి వస్తుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఓటేయకుండా వైసీపీ తప్పుకుందని విమర్శించారు.

టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ, పార్లమెంట్ సాక్షిగా బీజేపీ-వైసీపీ బంధం మరోసారి బయటపడిందని విమర్శించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ పాల్గొనకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆయన విమర్శలు గుప్పించారు. దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ, మోదీ చేసిన అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘రాఫెల్’ కుంభకోణంపై దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం మోదీకి ఉందని అన్నారు. ‘రాఫెల్’ కుంభకోణంలో అవినీతితో పాటు దేశ ద్రోహం కూడా జరిగిందని డొక్కా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Jagan
buddha venkanna
  • Loading...

More Telugu News