ligquor: ఏపీ వ్యాప్తంగా మద్యం సరఫరా బంద్

  • యూఎస్ సీ సంస్థకు బకాయిపడ్డ ఏపీ బెవరేజెస్  
  • పదిహేడు నెలలుగా రూ.59 కోట్ల బకాయిలు
  • మాన్యువల్ పద్ధతిలో మద్యం సరఫరాకు నిర్ణయం

ఏపీ వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం దుకాణాలకు సరఫరా ఆగిపోయింది. మద్యం అమ్మకాలను ఆన్ లైన్ లో నియంత్రించే యూఎస్ సీ సంస్థ సేవలు నిలిపివేయడంతో సరఫరా నిలిచిపోయింది. యూఎస్ సీ సంస్థకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ బకాయిపడింది. ఏపీ ప్రభుత్వం ఇంత వరకూ ఆ బకాయిలు విడుదల చేయకపోవడంతో యూఎస్ సీ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పదిహేడు నెలలుగా రూ.59 కోట్ల బకాయిలు చెల్లించలేదు. కాగా, మద్యం సీసాలకు బార్ కోడ్, హాలో గ్రామ్ సాఫ్ట్ వేర్ ను యూఎస్ సీ నిలిపివేసింది. ఈ సమస్య పరిష్కారం నిమిత్తం అబ్కారీ శాఖ కమిషనర్ ను మద్యం డీలర్లు కలవనున్నారు. మరోపక్క, మాన్యువల్ పద్ధతిలో మద్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అబ్కారీ శాఖ కమిషనర్  లక్ష్మీనరసింహం ఆదేశాలు జారీ చేశారు. 

  • Loading...

More Telugu News