adivi shesh: 'గూఢచారి' చూస్తున్నంత సేపు చప్పట్లు కొడుతూనే వున్నాను: నాగార్జున

- తక్కువ వనరులతో బాగా తీశారు
- ఆడియన్స్ ను ప్రభావితం చేసింది
- కొన్ని సీన్స్ చూసి షాక్ అయ్యాను
అడవి శేష్ ప్రధానమైన పాత్రను పోషించిన 'గూఢచారి' ఇటీవలే థియేటర్లకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత మౌత్ టాక్ తోనే మరింతగా వసూళ్లు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నాగార్జున స్పందించారు. "పెద్ద మొత్తంలో తమ సినిమాలకి ఖర్చు పెట్టేస్తూ తామంతా ఏదేదో చేస్తున్నామనీ, కానీ చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన 'గూఢచారి' ఘన విజయాన్ని సాధించిందని అన్నారు.
