YSRCP: బీజేపీతో వైసీపీ లాలూచీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి: మంత్రి అచ్చెన్నాయుడు

  • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ నాటకం
  • ఓటింగ్ లో వైసీపీ ఎందుకు పాల్గొనలేదు?
  • ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు

బీజేపీతో వైసీపీ లాలూచీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ నాటకమాడిందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించిన వైసీపీ, ఓటింగ్ లో పాల్గొనకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

బీజేపీకి సహకరించేందుకే ఓటింగ్ కు వైసీపీ గైర్హాజరైందని, ఈ చర్యతో బీజేపీ వ్యతిరేక ఓటు సంఖ్యా బలం తగ్గించారని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) పీఏసీ ఎన్నికలో ఏ పార్టీకి ఓటు వేశారో జగన్, విజయసాయిరెడ్డి చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

YSRCP
bjp
atchanaidu
  • Loading...

More Telugu News