Angelina Jolie: రూ.61 కోట్లు ఇచ్చాను.. అయినా నా పేరు చెడగొడుతోంది!: ఏంజెలినా జోలీపై బ్రాడ్ పిట్ ఆగ్రహం

- కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ఆవేదన
- పిల్లల కస్టడీ కోరుతూ మరో పిటిషన్
- 2016లోనే విడిపోయిన హాలీవుడ్ జంట
బ్రాంజెలీనా.. హాలీవుడ్ సెలబ్రిటీ జంట ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ లకు అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరిది. 2016, సెప్టెంబర్ లో ఈ జంట విడిపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు. తాగుడుకు బానిసైన పిట్.. పిల్లల్ని కొట్టడంతో ఏంజెలినా విడాకులు తీసుకుంది. ఈ సందర్భంగా కోర్టు ఆరుగురు పిల్లల సంరక్షణను ఏంజెలినాకే అప్పగించింది.

హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ ను 2000లో పెళ్లి చేసుకున్న బ్రాడ్ పిట్.. 2005లో విడాకులు తీసుకున్నాడు. నటులు జోనాథన్ లీ మిల్లర్, బిల్లీ బాబ్ లను గతంలో పెళ్లాడిన ఏంజెలినా వారికి విడాకులిచ్చింది. ఏంజెలినా-బ్రాడ్ పిట్ జంటకు ఆరుగురు పిల్లలు కాగా, వీరిలో ఇద్దరు దత్తత పిల్లలు.