chiranjeevi: భారీ పోరాట సన్నివేశాల చిత్రీకరణలో 'సైరా'

  • ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు
  • టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ 
  • వచ్చే వేసవిలో సినిమా రిలీజ్

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. చిరంజీవి .. నయనతార .. జగపతిబాబు .. తదితరులపై భారీ పోరాట సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ సినిమా ఇక్కడే షూటింగ్ జరుపుకోనుంది. ఇంతవరకూ చిరంజీవి చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి ఈ పోరాట సన్నివేశాలు పూర్తి భిన్నంగా వుంటాయని అంటున్నారు.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో డిజైన్ చేయబడిన పోరాట సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు. తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో చిత్రీకరించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కావడంతో, అభిమానులలో ఉత్సాహాన్ని నింపడం కోసం టీజర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ వున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.        

  • Loading...

More Telugu News