Andhra Pradesh: జగన్ ది ‘వీక్లీ ఆఫ్’ పాదయాత్ర: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎద్దేవా

  • కేంద్రానికి మద్దతుగానే జగన్ వంచన దీక్ష
  • మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపణ
  • కడప ఉక్కు ఫ్యాక్టరీపై జగన్ నోరు మెదపలేదని వెల్లడి

వైసీసీ అధినేత జగన్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. కేంద్రానికి మద్దతుగానే జగన్ వంచనపై గర్జన దీక్ష చేస్తున్నారని విమర్శించారు. దేశంలో వీక్లీ ఆఫ్ లతో పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. గుంటూరులో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో పుల్లారావు మాట్లాడారు.

రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు టీడీపీని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ఇవ్వకపోయినా జగన్ నోరు మెదపలేదని పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన యువనేస్తం పథకాన్ని చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అసలు రాష్ట్రానికి జగనే మోసం చేశారని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh
YSRCP
Jagan
prattipati pulla rao
vanchana deeksha
  • Loading...

More Telugu News