KTR: ఇండియాలో మొట్టమొదటి ఐకియా స్టోర్ హైదరాబాద్ లో ప్రారంభం!

- హైదరాబాద్ లోని హైటెక్స్‌లో లాంచ్
- ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- 2025 నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో 25 ఐకియా స్టోర్లు
స్వీడన్ కి చెందిన ఐకియా ఫర్నీచర్ దిగ్గజం తన నూతన స్టోర్‌ను తాజాగా నేడు హైదరాబాద్ హైటెక్స్‌లో లాంచ్ చేసింది. కాసేపటి క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ స్టోర్‌ను ప్రారంభించారు. ఇండియాలో ఐకియా ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్టోర్ కూడా ఇదే కావడం విశేషం. 4 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో దాదాపుగా 7500 స్వీడిష్ బ్రాండ్లు ఉన్నాయి.

