Rajya Sabha: టీఆర్ఎస్ కూడా హ్యాండిచ్చింది... రాజ్యసభ ఎన్నికలకు దూరమట!

  • యూపీఏకు దెబ్బ మీద దెబ్బ
  • వరుసగా షాకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు
  • ఓటింగ్ లో పాల్గొనరాదని కేసీఆర్ నిర్ణయం

నేడు జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో విపక్ష యూపీఏకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ప్రతిపక్షంలోని పార్టీలన్నీ ఏకతాటిపై ఉంటాయని, తమ అభ్యర్థి విజయం సులువేనని భావిస్తూ వచ్చిన ఆ పార్టీకి తొలుత ఆమ్ ఆద్మీ, ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ షాకిచ్చాయి. ఈ ఎన్నికల ఒటింగ్ కు ఎంపీలంతా దూరంగా ఉండాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఎంపీలకు ఆదేశాలు అందాయి. దీంతో ఓటింగ్ ను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. కాగా, ఎన్డీయే తరఫున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్, యూపీఏ తరఫున కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News