Tollywood: మహేష్ బాబుతో దిగిన ఫొటోను పోస్టు చేస్తూ విషెస్ చెప్పిన కేటీఆర్!

  • నేడు ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు
  • ట్విట్టర్ లో విషెస్ చెప్పిన కేటీఆర్
  • అత్యంత అణకువ ఉన్న సూపర్ స్టార్ అని పొగడ్తలు

నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. తనకు తెలిసిన అత్యంత అణకువ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబేనని చెబుతూ, అతను తనకు ప్రియమైన మిత్రుడని వ్యాఖ్యానించారు.

పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలని, మీ అద్వితీయమైన ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా గతంలో మహేష్ తో తాను దిగిన ఓ చిత్రాన్ని పోస్టు చేశారు కేటీఆర్. కాగా, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా, ఆయన 25వ చిత్రం టైటిల్ ను 'మహర్షి'గా చిత్ర టీమ్ ఈ ఉదయం రివీల్ చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News