merina beach: మెరీనా బీచ్ కు చేరుకున్న కరుణానిధి కుటుంబసభ్యులు

  • ‘మెరీనా’కు చేరుకున్న స్టాలిన్, కనిమొళి తదితరులు
  • ఇప్పటికే అక్కడికి చేరుకున్న పలువురు ప్రముఖులు
  • ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు

డీఎంకే అధినేత కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్ లో జరగనున్న నేపథ్యంలో కుమారుడు స్టాలిన్, కూతురు కనిమొళి, ఆయన కుటుంబసభ్యులు కొద్ది సేపటి క్రితం అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పలువురు ప్రముఖులకు స్టాలిన్, కనిమొళిలు నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. కాగా, కొద్ది సేపట్లో కరుణానిధి అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. త్రివిధ దళాలు అక్కడికి చేరుకున్నాయి. తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 

merina beach
karunanidhi family
  • Loading...

More Telugu News