karunanidhi: రాజాజీ హాల్ నుంచి కరుణ పార్థివ దేహం తరలింపు.. ఊరేగింపుగా మెరీనా బీచ్ కు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-cd24f0c9f990ad85528059a48bbc76ff610ab5b2.jpg)
- మొదలైన కరుణానిధి అంతిమయాత్ర
- వాలాజా రోడ్, చేపాక్ స్టేడియంల మీదుగా మెరీనాకు
- కంటతడి పెడుతున్న అభిమానులు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన పార్థివదేహాన్ని త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది తమ భూజాలపై మోస్తూ... అంతిమయాత్ర వాహనంలోకి చేర్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వేలాది మంది హృదయాలు బరువెక్కాయి. అక్కడున్న వారంతా తీవ్ర భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు. అశేష జనవాహిని కరుణ పార్థివ దేహం వెంట నడుస్తూ మెరీనా బీచ్ వైపు కదిలారు. ఈ అంతిమయాత్ర రాజాజీ హాల్ నుంచి వాలాజా రోడ్, చేపాక్ స్టేడియంల మీదుగా మెరీనాకు చేరుకుంటుంది. 5 గంటలకు మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతాయి.
![](https://img.ap7am.com/froala-uploads/froala-0a4f5ff2d954a0dfb42b5411055334eb6b21b09e.jpg)