nithin: ద్వారకా తిరుమల వెళ్లిన 'శ్రీనివాస కల్యాణం' టీమ్

- సతీశ్ వేగేశ్నతో దిల్ రాజు మూవీ
- కథాకథనాలే ప్రధాన బలం
- ఈ నెల 9వ తేదీన భారీ విడుదల
ఒక సినిమాను పూర్తి చేయడమంటే .. ఒక యజ్ఞాన్ని పూర్తిచేయడం లాంటిదే. అంత కష్టపడి పనిచేసిన చిత్రం విజయవంతం కావాలనే అంతా కోరుకుంటారు. సినిమా కథా కథనాలు ఏవైనా అది సక్సెస్ ను సాధించాలంటే భగవంతుడి అనుగ్రహం వుండాలని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయా సినిమాల విడుదలకి ముందు ఆ సినిమా సభ్యులు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ వుంటారు .. తమ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటూ వుంటారు.
