kcr: కరుణ పార్థివదేహం వద్ద పిడికిలి బిగించిన కేసీఆర్!

  • కరుణానిధికి నివాళి అర్పించిన కేసీఆర్, రాహుల్, అఖిలేష్
  • కేసీఆర్ తో పాటు చెన్నై వెళ్లిన కవిత
  • కరుణ కుటుంబాన్ని పరామర్శించిన నేతలు

రాజకీయ దిగ్గజం కరుణానిధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా ఉన్నారు. నివాళి అర్పించిన అనంతరం... జోహార్ కరుణానిధి అంటూ పిడికిలి బిగించారు కేసీఆర్. అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు.
మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ లు కూడా కరుణానిధికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

kcr
Rahul Gandhi
akhilesh yadav
tejaswi yadav
kavitha
karunanidhi
  • Loading...

More Telugu News