Amitabh Bachchan: కరుణ చేతుల మీదుగానే తొలి జాతీయ అవార్డు అందుకున్నా: అమితాబ్ భావోద్వేగం

  • ట్విట్టర్ లో స్పందించిన బిగ్ బీ
  • సాత్ హిందుస్తానీ సినిమాకు అవార్డు అందుకున్నట్లు వెల్లడి
  • కరుణ మృతి పట్ల విచారం

కలైంజర్ కరుణానిధి మరణంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. తన తొలి జాతీయ అవార్డును కరుణ చేతుల మీదుగానే అందుకున్నానని భావోద్వేగంతో ట్వీట్ చేశారు. కరుణానిధి మృతి పట్ల అమితాబ్ విచారం వ్యక్తం చేశారు.

కరుణ చనిపోవడంపై బిగ్ బీ స్పందిస్తూ..‘‘గౌరవీనయులైన, శక్తిమంతమైన నేత కరుణానిధి మృతికి సంతాపం తెలుపుతున్నాను. నేను నటించిన ‘సాత్ హిందుస్తానీ’ సినిమాకు తొలి జాతీయ అవార్డును చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కరుణ చేతుల మీదుగానే అందుకున్నాను. అప్పుడు ఆయన తమిళనాడు సీఎంగా ఉన్నారు’’ అని ట్వీట్ చేశారు.

పోర్చుగీస్ పాలన నుంచి గోవాకు విముక్తి కల్పించేందుకు ఏడుగురు యువకులు పోరాడే కథాశంతో సాత్ హిందుస్తానీ చిత్రం తెరకెక్కింది. 1969లో విడుదలైన ఈ సినిమాకు ఖాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వం వహించడంతో పాటు చిత్రాన్ని ఆయనే నిర్మించారు.

Amitabh Bachchan
karunanidhi
Tamilnadu
merina beach
Twitter
saat hindustani
  • Error fetching data: Network response was not ok

More Telugu News