karunanidhi: కరుణానిధితో ఆ క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేను: మోహన్ బాబు

  • ఆయన చేతుల మీదుగా అవార్డులను అందుకోవడం గొప్ప గౌరవం
  • సంక్షేమ పథకాలతో లక్షలాది మందికి మేలు చేశారు
  • తన రచనలతో లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపారు

కరుణానిధి మరణం తనను ఎంతో బాధిస్తోందని ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని తెలిపారు. ఆయన కుటుంబంతో తమకు మంచి అనుబంధం ఉందని ఆయన తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నానని చెప్పారు. తన సోదరులు స్టాలిన్, అళగిరి, ఇతర కుటుంబసభ్యులకు సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు.

కరుణానిధి రాజకీయ దిగ్గజమే కాదని... అద్భుతమైన రచయిత, వక్త అని మోహన్ బాబు కొనియాడారు. ఆయన మాటలు ఉద్వేగపరుస్తాయని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లక్షలాది జీవితాలకు మేలు చేశాయని, తన రచనలతో లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపారని కొనియాడారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'నీడ', 'బంగారక్క' చిత్రాలకు కరుణ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. 

karunanidhi
mohanbabu
  • Loading...

More Telugu News