karunanidhi: ముగ్గురూ ఒక చోటకు చేరుకున్నారు!: కమలహాసన్

  • అన్నా, ఎంజీఆర్, కరుణ ఒకే చోటకు చేరుకున్నారు
  • ముగ్గుర్నీ ఒకే చోట చూడటం బాగుంది 
  • కరుణ లేని లోటును పూడ్చలేం

డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కజగంను ముందుకు తీసుకెళ్లడంలో, దాన్ని పరిరక్షించడంలో అన్నాదురైకి తోడుగా ఇద్దరు సోదరులు కరుణానిధి, ఎంజీఆర్ ఉండేవారని... ఇప్పుడు వారి ముగ్గురిని ఒకే చోట చూడటం బాగుందని కమల్ ట్వీట్ చేశారు. కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. తమిళనాడుకు ఆయన లేని లోటును పూడ్చడం చాలా కష్టమని చెప్పారు. తమిళనాడు ఒక యోధుడిని కోల్పోయిందని అన్నారు. మెరీనా బీచ్ లో అంత్యక్రియలపై ఇప్పుడు మాట్లాడటం భావ్యం కాదని చెప్పారు.

karunanidhi
Kamal Haasan
mgr
annadurai
  • Loading...

More Telugu News