karunanidhi: కరుణానిధి స్క్రీన్ ప్లే అందించిన తెలుగు సినిమా ఇదే..!

  • కృష్ణ నటించిన 'అమ్మాయి మొగుడు-మామకు యముడు' సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన కరుణ
  • తెలుగు సినీ రంగంతో కూడా అనుబంధాన్ని కొనసాగించిన కరుణ
  • పలు సినీ వేడుకలకు హాజరు

రాజకీయాల్లో ఎంతో బిజిగా ఉన్నప్పటికీ... సినీ పరిశ్రమతో తన అనుబంధాన్ని కరుణానిధి కొనసాగిస్తూనే వచ్చారు. ఏదైనా సినిమా ఫంక్షన్ కు పిలిస్తే, తప్పకుండా హాజరయ్యేవారు. తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా ఆయనకు అనుబంధం ఉంది. రామానాయుడు నిర్మించిన 'ప్రేమనగర్' సినిమా శతదినోత్సవ వేడుకకు కరుణ హాజరై... నటీనటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. దాసరి దర్శకత్వం వహించిన 'నీడ' చిత్ర శతదినోత్సవానికి కూడా కరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఓ తెలుగు సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే అందించడం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'అమ్మాయి మొగుడు-మామకు యముడు' సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే రాశారు. తమిళంలో జయశంకర్, జయచిత్ర జంటగా నటించిన 'వండిక్కారణ్ మగన్' చిత్రానికి తెలుగు రీమేక్ ఈ సినిమా. తమిళ సినిమాకు మాటలు రాసిన కరుణానిధి, తెలుగు చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. కరుణ మేనల్లుడు మురసోలి సెల్వం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 

karunanidhi
krishna
ramanaidi
telugu film
screen play
  • Loading...

More Telugu News