karunanidhi: కరుణకు ప్రధాని మోదీ నివాళి.. హోరెత్తిన రాజాజీ హాల్!

- కలైంజర్ కు మోదీ నివాళి
- కుటుంబ సభ్యులని ఓదార్చిన ప్రధాని
- అభిమానుల నినాదాలతో మార్మోగిన రాజాజీ హాల్
రాజాజీ హాల్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కరుణానిధి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఎంకే శ్రేణుల నినాదాలతో రాజాజీ హాల్ హోరెత్తింది. కరుణకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులని మోదీ ఓదార్చారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వెన్ను తట్టి ధైర్యం చెప్పారు.
