Chennai: కోర్టు తీర్పు తరువాత ఒక్కసారిగా పెల్లుబికిన భావోద్వేగం... కన్నీటి పర్యంతమైన స్టాలిన్!

  • మెరీనా బీచ్ లో అంత్యక్రియలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 
  • మైకులో చెప్పగానే రాజాజీ హాల్ ముందు ఉద్వేగం
  • శవపేటికను పట్టుకుని విలపించిన కరుణ కుటుంబీకులు

చెన్నైలోని మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసిన తరువాత రాజాజీ హాల్ వద్ద భావోద్వేగాలు పెల్లుబికాయి. ఈ విషయం తెలిసిన వెంటనే, మైకుల ద్వారా అనౌన్స్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్టాలిన్, అళగిరి, కనిమొళి తదితరులు పెద్దపెట్టున విలపించారు. తండ్రి భౌతికకాయాన్ని ఉంచిన శవపేటికను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు.

 అక్కడే వేలాదిగా ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకు వచ్చి, 'కలైంజర్ వాంగే' అని నినాదాలు చేశారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్న సంతృప్తి స్టాలిన్ తదితరుల్లో కనిపించింది. అనుకున్నట్టుగానే తమ నేతకు గౌరవం దక్కుతుందన్న భావన కార్యకర్తల్లో కనిపించింది. అప్పటివరకూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, తమకు మెరీనా బీచ్ కావాలంటూ నివాళులు అర్పిస్తున్న డీఎంకే కేడర్, ఇప్పుడు 'కలైంజర్ కలైంజర్' అంటూ నినాదాలు చేస్తున్నారు. 

Chennai
Karunanidhi
Funeral
Rajaji Hall
Merina Beach
  • Loading...

More Telugu News