Chennai: పళనిస్వామికి చుక్కెదురు... 'రావద్దూ... రావద్దూ' అని అరిచిన డీఎంకే కార్యకర్తలు!

  • చెన్నైలోని రాజాజీ హాల్ లో భౌతికకాయం
  • అంత్యక్రియల విషయంలో సానుకూలంగాలేని ప్రభుత్వం
  • పళనిస్వామి వస్తే వ్యతిరేకత తెలిపిన కార్యకర్తలు

చెన్నైలోని రాజాజీ హాల్ లో నేతలు, కార్యకర్తల సందర్శనార్థం కరుణానిధి భౌతికకాయాన్ని ఉంచిన వేళ, అక్కడికి వచ్చిన తమిళనాడు సీఎం పళనిస్వామికి డీఎంకే కార్యకర్తల నుంచి చుక్కెదురైంది. తమ నేతను కడసారి వీక్షించేందుకు వచ్చిన అసంఖ్యాకమైన కార్యకర్తలు పళనిస్వామిని అక్కడికి రావద్దని పెద్దపెట్టున నినాదాలు చేశారు.

నిన్న కరుణానిధి మరణించిన తరువాత, అంత్యక్రియల విషయంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, జయలలిత అంత్యక్రియలు జరిగిన మెరీనా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు చేయాలని డీఎంకే పట్టుబడుతుండగా, ప్రభుత్వం నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి పట్ల తమకున్న వ్యతిరేకతను డీఎంకే కార్యకర్తలు ఇలా చూపారు. రాజాజీ హాల్ కు వచ్చిన పళనిస్వామి, కరుణ భౌతికకాయానికి నివాళులు అర్పించి, అక్కడి నుంచి వెంటనే వెనుదిరిగారు.

Chennai
Rajaji Hall
Karunanidhi
Palaniswamy
  • Loading...

More Telugu News