vivo: వివో ఫ్రీడమ్ కార్నివాల్ సేల్: రూ.1947లకే వివో నెక్స్, వివో వీ9 స్మార్ట్‌ఫోన్!

  • మూడు రోజుల పాటు ఆన్‌లైన్ సేల్
  • రూ.72కె యూఎస్బీ కేబుల్స్, ఇయర్ ఫోన్స్ లభ్యం
  • ఇతర స్మార్ట్‌ఫోన్ లపై కార్డుల ద్వారా రూ.4000 క్యాష్ బ్యాక్

72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ 'వివో ఫ్రీడమ్ కార్నివాల్' పేరిట ఆన్‌లైన్ సేల్ ని ప్రకటించింది. ఈరోజు నుండి 9వ తేదీ వరకు ఈ ఫ్లాష్ సేల్‌ జరగనుంది. ఈ మూడు రోజులలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్ మొదలవుతుంది. ఈ ఫ్లాష్ సేల్‌లో భాగంగా రూ.44990 ధర గల వివో నెక్స్, రూ.22990 ధర గల వివో9 స్మార్ట్‌ఫోన్ లని కేవలం రూ.1947లకే కొనవచ్చు. కానీ, ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. దీంతో పాటు రూ.72కే యూఎస్బీ కేబుల్స్, ఇయర్ ఫోన్స్ లభ్యం కానున్నాయి. అలాగే, ఇతర స్మార్ట్‌ఫోన్ లపై క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రూ.4000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఆసక్తి గల కొనుగోలుదారులు shop.vivo.com/in/index.html వెబ్ సైట్ లో లాగిన్ కావలసి ఉంటుంది.

వివో నెక్స్ ప్రత్యేకతలు:

  • 6.59" డిస్‌ప్లేతో పాటు 2,316 x 1,080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్
  • ఆండ్రాయిడ్ ఓరియో 8.1, ఫన్ టచ్ ఓఎస్ 4.0
  • 8జీబీ ర్యామ్,128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
  • డ్యూయల్ బ్యాక్ కెమెరాలు: 12/5 మెగాపిక్సెల్
  • ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
  • బ్యాటరీ: 4000ఎంఏహెచ్

వివో వీ9 ప్రత్యేకతలు:

  • 6.3" డిస్‌ప్లేతో పాటు 2280x1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్
  • 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
  • డ్యూయల్ బ్యాక్ కెమెరాలు: 13/2 మెగాపిక్సెల్
  • ఫ్రంట్ కెమెరా: 24 మెగాపిక్సెల్
  • ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో, ఫన్ టచ్ ఓఎస్ 4.0
  • బ్యాటరీ: 3260ఎంఏహెచ్

vivo
vivo nex
Vivo V9
Tech-News
China
India
offer
smart phone
  • Loading...

More Telugu News