Telugudesam: టీడీపీకి రాజీనామా చేసిన కృష్ణా జిల్లా నేత బూరగడ్డ రమేష్ నాయుడు

  • గిడ్డంగుల సంస్థకు చైర్మన్ గా పనిచేసిన బూరగడ్డ
  • చంద్రబాబుకు రాజీనామా లేఖ
  • రావాల్సిన గుర్తింపు రాలేదని ఆవేదన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, కృష్ణా జిల్లాలో టీడీపీ సీనియర్ నేత బూరగడ్డ రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. టీడీపీ సభ్యత్వానికి రిజైన్ చేశానని చెప్పిన ఆయన, తాను ఎంతగా శ్రమిస్తున్నా, పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని ఆరోపించారు.

గత మూడున్నర దశాబ్దాలుగా తాను వివిధ స్థాయుల్లో పని చేశానని గుర్తు చేశారు. పార్టీకి అంకితభావంతో సేవలను అందించినా, తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరాలన్న విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని బూరగడ్డ వెల్లడించారు.

Telugudesam
Buragadda Ramesh
Krishna District
Resign
  • Loading...

More Telugu News