Gandra Venkataramanareddy: గండ్రపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన విజయలక్ష్మి... ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది!: రెడ్డి సంఘం అధ్యక్షురాలు

  • ముగ్గురిని మోసం చేసి వదిలేసిన విజయలక్ష్మి
  • స్వచ్ఛంద సంస్థ పేరిట బ్లాక్ మెయిల్
  • ఆరోపణలు గుప్పించిన రెడ్డి సంఘం అధ్యక్షురాలు సంధ్యారెడ్డి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి పోలీసులను ఆశ్రయించిన విజయలక్ష్మి రెడ్డి, ఎన్నో అసత్యాలు చెబుతోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంధ్యారెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, ఆమెకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ఆ ముగ్గురినీ మోసం చేసి వదిలేసిందని చెప్పారు.

విజయలక్ష్మి తొలుత పస్రా గ్రామానికి చెందిన రాజిరెడ్డిని పెళ్లి చేసుకుని మూడు నెలల కాపురం తరువాత వదిలేసిందని, ఆపై నర్సింహారెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఐదేళ్లు అతన్ని ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. ఆమె బాధ తాళలేక నర్సింహారెడ్డి వదిలేశాడని, ఆ తరువాత ఇంకో వ్యక్తిని ఆమె పెళ్లాడిందని చెప్పారు.

అప్పటికీ బుద్ధి పోనిచ్చుకోని ఆమె, అతనితో కాపురం చేయకుండా స్వచ్ఛంద సంస్థ పేరిట బ్లాక్ మెయిల్ కు దిగిందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు లక్ష్యంగా ఆమె కుట్రలు చేసిందని అన్నారు. వెంకటరమణారెడ్డిపై ఆరోపణల వెనుక టీఆర్ఎస్ నేతలు గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ల ప్రమేయం ఉందని ఆరోపించారు.

Gandra Venkataramanareddy
Vijayalakshmi reddy
Sandhya Reddy
  • Loading...

More Telugu News