India: గోల్ఫ్ ఆడి.. ముఖానికి దెబ్బ తగిలించుకున్న ఇంగ్లండ్ పేస్ బౌలర్ ఆండర్సన్!

  • తొలి టెస్టు తరువాత గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన ఆండర్సన్
  • ఎదురుగా ఉన్న చెట్టును తాకి బలంగా వెనక్కు వచ్చిన బంతి
  • మొత్తం ఘటనను వీడియో తీసిన స్టువర్ట్ బ్రాడ్

జేమ్స్ ఆండర్సన్... ఇంగ్లండ్ క్రికెట్ టీములో పేస్ బౌలర్, ఇండియాతో తొలి టెస్టులో గెలిచిన తరువాత అందరూ సంబరాలు చేసుకుంటుంటే, స్టువర్ట్ బ్రాడ్ తో కలసి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లాడు. చాలాసేపు గోల్ఫ్ ఆడుతూ ఎంజాయ్ చేశారు కూడా. ఇక గోల్ఫ్ బంతిని కిందపెట్టిన ఆండర్సన్, దాన్ని బలంగా కొడుతున్న దృశ్యాన్ని వెనుక నిలబడి వున్న బ్రాడ్ వీడియో తీస్తున్న వేళ, తాను కొట్టిన బంతి, తిరిగొచ్చి ఆండర్సన్ ముఖాన్ని తాకింది.

ఆ బంతి, ఎదురుగా ఉన్న చెట్టును తాకి తిరిగి అంతే బలంతో వెనక్కు వచ్చి ఆండర్సన్ ముఖాన్ని కొట్టింది. ఈ దెబ్బకు ఆండర్సన్ విలవిల్లాడాడు. ఆపై బ్రాడ్ దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయగా, దీన్ని చూసిన కొందరు అభిమానులు అతనికి ఏమైందంటూ పోస్టులు పెడుతుండగా, మరికొందరు పళ్లేమైనా ఊడాయా? అని సరదా కామెంట్స్ చేస్తున్నారు.

India
England
Cricket
Anderson
Broad
  • Error fetching data: Network response was not ok

More Telugu News