Kamal Haasan: రూ. లక్ష కోట్లతో అవినీతి అంతు చూస్తా: కమలహాసన్

  • విశ్వరూపం-2 ప్రచారంలో బిజీగా ఉన్న కమల్
  • సినిమా జీవితం ముఖ్యం కాదు
  • నగరాలతో పోలిస్తే పల్లెల్లో ఫ్యాన్స్ ఎక్కువ

సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిని అంతం చేసేందుకు తన వద్ద ఓ మంచి పథకం ఉందని, దీనిని అమలు చేసేందుకు రూ. లక్ష కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నానని 'మక్కళ్‌ నీది మయ్యమ్' అధ్యక్షుడు హీరో కమలహాసన్‌ వ్యాఖ్యానించారు. అతి త్వరలో తాను నటించిన 'విశ్వరూపం-2' విడుదల కానున్న నేపథ్యంలో, ప్రస్తుతం సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆయన, మీడియాతో మాట్లాడారు.

తన మనసులోని పథకం అమలులోకి వస్తే, అవినీతి, లంచం పూర్తిగా మాయమవుతాయని అభిప్రాయపడ్డారు. తనకు సినిమా జీవితం ముఖ్యం కాదని, సినిమాలతో స్నేహం రాజకీయాలకు ఉపయోగపడుతుందా? అని అడిగితే, తాను ఎందుకు ఉపయోగించుకోకూడదనే ప్రశ్నిస్తానని చెప్పారు. నగరాలు, పట్టణాలతో పోలిస్తే పల్లె ప్రాంతాల్లో తనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారని కమల్ వ్యాఖ్యానించారు. వారికి తాను ఓ నటుడిగానే ఇప్పటివరకూ తెలుసునని, ఇక మీదట రాజకీయ నేతగానూ తనను వారు ఆదరిస్తారని భావిస్తున్నానని చెప్పారు.

Kamal Haasan
Vishwaroopam-2
Pramotions
Tamilnadu
  • Loading...

More Telugu News