bullock cart: ఏపీ సచివాలయంలో ఎడ్లబండితో రైతు కుటుంబం.. కళాకారుని ప్రతిభకు సందర్శకుల ఫిదా!
- సచివాలయ పార్క్‌లో ఎద్దుల బండితో రైతు కుటుంబం
- జీవకళ ఉట్టేపడేలా ఉన్న విగ్రహం
- చూసేందుకు ఎగబడుతున్న సందర్శకులు
ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో ఎడ్లబండి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. బండినిండా ధాన్యం బస్తాలు, దానిపై రైతు కుటుంబం, బండి ముందు నడుస్తున్న రైతు... జీవకళ ఉట్టిపడుతున్న ఈ విగ్రహం సచివాలయంలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. కొంచెం దూరం నుంచి చూస్తే మాత్రం ఓ రైతు ఎడ్లబండితో సరాసరి సచివాలయంలోకి వెళ్తున్నట్టు భ్రమపడకమానరు.
అయితే, దగ్గరికి వెళ్లి తట్టి చూస్తే తప్ప అది బొమ్మ అని తెలియదు. అంత అద్భుతంగా, జీవకళ ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దారు. సచివాలయ పార్కులో ఏర్పాటు చేసిన ఈ బొమ్మ అందరినీ ఆకర్షిస్తోంది. సందర్శకులు ముచ్చటపడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్ట్ డైరెక్టర్ పీవీ అంబాజీ ఫైబర్ మెటీరియల్ తో దీనిని రూపొందించారు. తయారీకి రెండు నెలల సమయం పట్టగా, రూ.9 లక్షల వరకు ఖర్చు అయిందని అంచనా.