Sye Raa Narasimha Reddy: రామోజీ ఫిలిం సిటీలో ‘సైరా’ సెట్.. నేటి నుంచి షూటింగ్ ప్రారంభం!

  • సైరా సెట్‌ను ఇటీవల కూల్చివేసిన అధికారులు
  • కొత్త సెట్లో ఏకధాటిగా నెల రోజుల షూటింగ్
  • చిరంజీవి బర్త్ డే నాడు ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ సినిమా షూటింగ్ ఇటీవల నిలిచిపోయింది. శేరిలింగంపల్లిలో సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో వేసిన సెట్‌ను ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అనుమతి లేకుండా సెట్ వేశారని చెబుతూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెట్ కూల్చివేత వివాదాస్పదమైంది. మరోవైపు సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే, ఈ వివాదం తేలే వరకు ఆగితే సినిమా విడుదల ఆలస్యం అవుతుందని, నిర్మాత నష్టపోవాల్సి వస్తుందని భావించారు. దీంతో రామోజీ ఫిలిం సిటీలో కొత్త సెట్ వేసిన యూనిట్, నేటి నుంచి షూటింగ్‌కు సిద్ధమవుతోంది.

ఈ కొత్త సెట్‌లో నెలరోజులపాటు ఏకధాటిగా షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సెట్‌లోనే బ్రిటిషర్లతో సైరా నరసింహారెడ్డికి మధ్య జరిగే పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. చిరంజీవి బర్త్‌డేను పురస్కరించుకుని సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. 

Sye Raa Narasimha Reddy
Chiranjeevi
Megastar
Hyderabad
  • Loading...

More Telugu News