gvl: ప్రతి బుడబుక్కలోడు ఎంక్వైరీలు అడుగుతుంటే పరిపాలన చేయాలా?: జీవీఎల్ పై కుటుంబరావు ఫైర్

  • జీవీఎల్ ఆరోపణలు రుజువైతే  స్వచ్ఛందంగా అరెస్టవుతా
  • రుజువు కాకపోతే జీవీఎల్ అరెస్టు అవుతారా?
  • కేంద్రంపై కాగ్ రిపోర్ట్ ఒక్క కామెంటూ చేయలేదా!

పీడీ అకౌంట్స్ లో అవినీతి జరిగిందంటూ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. ‘టీవీ9’లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, జీవీఎల్ చెప్పిన 6 కార్పొరేషన్లలో ఒక్క పైసా దారిమళ్లిందని రుజువైనా తాను స్వచ్ఛందంగా అరెస్టవుతానని, ఒకవేళ రుజువు కాకపోతే జీవీఎల్ అరెస్టవుతారా? అని సవాల్ విసిరారు.

ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లో రూపాయి దారిమళ్లితే దర్యాప్తు తానే వేసుకుంటానని, ప్రతి బుడబుక్కలోడు ఎంక్వైరీలు అడుగుతుంటే పరిపాలన చేయాలా? ఇవన్నీ చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు. 'ఇరవై నాలుగు గంటల్లో లేఖ పంపమనండి, వివరణ ఇస్తామని, తమ సమాచారమంతా తొంభై శాతం ఆన్ లైన్ లో ఉంటుందని' అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కాగ్ రిపోర్ట్ ఒక్క కామెంట్ కూడా చేయకుండా పునీతంగా ఉందా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

  • Loading...

More Telugu News