Hyderabad: హైదరాబాద్ లో మరోసారి ఐసిస్ కలకలం!

  • ఐసిస్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ సోదాలు
  • పలు డిజటల్ పరికరాలు స్వాధీనం 
  • అబ్దుల్ ఖదీర్ కుటుంబసభ్యులను ప్రశ్నించిన ఎన్ఐఏ

హైదరాబాద్ లో మరోసారి ఐసిస్ కలకలం రేపుతోంది. 2016 ఐసిస్ కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు డిజటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోని పహడీ షరీఫ్, హఫీజ్ బాబా నగర్ లో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది.

షాహీన్ నగర్ లోని అబ్దుల్ ఖదీర్ (19) ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేసింది. 2016లో ఢిల్లీలో పట్టుబడిన నిందితులతో అబ్దుల్ ఖదీర్ కు సంబంధాలు ఉన్నట్లు అనుమానం. అతని కుటుంబసభ్యులను అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా, సామాజిక మాధ్యమాల వేదికగా ఐసిస్ భావ జాలాన్ని అబ్దుల్ ఖదీర్ వ్యాప్తి చేస్తున్నాడనే అనుమానం ఉంది.

Hyderabad
isis
  • Loading...

More Telugu News