Rajya Sabha: ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక
- ఓటింగ్ లో 245 మంది సభ్యులు
- నెగ్గాలంటే 123 మంది సభ్యుల మద్దతు అవసరం
- ఎన్డీఏ బలం 106.. ప్రతిపక్షాల బలం 117
ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఓ ప్రకటన చేశారు. 245 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఈ ఎన్నికలో నెగ్గాలంటే 123 మంది సభ్యుల మద్దతు అవసరం. 14 మంది అన్నాడీఎంకే సభ్యులతో కలిసి ఎన్డీఏ బలం 106 కాగా, ఆరుగురు టీడీపీ సభ్యులతో కలిసి ప్రతిపక్షాల బలం 117. బీజేడీ, టీఆర్ఎస్ ను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీఏ అభ్యర్థిగా నరేష్ గుజ్రాల్ ను నిలబెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. కాగా, 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ కు తుదిగడువు.