Pawan Kalyan: ఇప్పటికైనా ఏపీలో అక్రమ మైనింగ్ ను ఆపాలి: పవన్ కల్యాణ్

  • హత్తిబెళగల్ లోని క్వారీలో పేలుడు ప్రదేశం పరిశీలన
  • ఈ ఘటన దురదృష్టకరం
  • ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్  

కర్నూలు జిల్లాలోని హత్తిబెళగల్ లోని క్వారీలో పేలుడు ప్రదేశాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ ఈరోజు పరిశీలించారు. క్వారీలో పేలుడు ఘటనలకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం, మీడియాతో పవన్ మాట్లాడుతూ, హత్తిబెళగల్ క్వారీ పేలుడు ఘటన దురదృష్టకరమని, సీఎం చంద్రబాబు ప్రజాసమస్యలను విస్మరించకూడదని సూచించారు.

ఏపీలో ఇప్పటికైనా అక్రమ మైనింగ్ ను ఆపాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతోందని, గనుల శాఖ మంత్రి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో 1600 క్వారీలకు అనుమతులు ఇచ్చారని, 600కి పైగా అక్రమ క్వారీలు నడుస్తున్నాయని, స్థానిక యువకులు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ సమస్యలపై త్వరలోనే స్పందిస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News