Chandrababu: ప్రపంచంలోనే తొలి థర్మల్ బ్యాటరీ ప్లాంట్‌ను ఆవిష్కరించనున్న చంద్రబాబు
- పునరుత్పాదక వనరులతో తొలి బ్యాటరీ ప్లాంట్
- వచ్చే ఏడాది నుంచి వాణిజ్య పరంగా ఉత్పత్తి
- వచ్చే మూడేళ్లలో 3 వేల మందికి ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రపంచంలోనే తొలి థర్మల్ బ్యాటరీ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్ (బీఈఎస్‌టీ) నెలకొల్పిన ఈ ప్యాక్టరీ పునరుత్పాదక వనరులను వినియోగించి బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్న తొలి కంపెనీగా రికార్డులకెక్కనుంది. ఫలితంగా సంప్రదాయ ఇంధన వనరుల వినియోగం తగ్గుతుంది. 2019 నుంచి కంపెనీ వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించనుంది .
ఈ సాంకేతికత వల్ల కర్బన్ ఉద్గారాల విడుదల తగ్గుతుంది. టెలికమ్యూనికేషన్, వాణిజ్య అవసరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, హైవే చార్జింగ్ స్టేషన్లకు ఈ బ్యాటరీలు చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కుగ్రామాలకు వీటివల్ల లెక్కకు మించి ఉపయోగాలున్నాయి.
ప్రస్తుతం వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ కంపెనీని వచ్చే ఆరేడేళ్లలో 10 గిగావాట్ల సామర్థ్యానికి పెంచనున్నారు. అలాగే మూడేళ్లలో 3 వేల ఉద్యోగాలను కల్పించనున్నారు.